
ఎన్ని సార్లు చెప్పాను రా…రాయి……బ్లోగ్ రాయి…… వేస్ట్ రా నువ్వు…
ఒక బ్లోగ్ రాయడం చేత కాదు ఎందుకు పనికి రాని పనికిమలిన వెదవ్వి…..
టైమ్ 10:00 – బ్రేక్ఫాస్ట్ లు తినేసి అందరు ఆరామ్ గా కూర్చున్న టైమ్….
పెళ్లి సూట్ లో రాజకుమారుడు సత్య పట్టు చీర లో రాజకుమారి దీప పెళ్లి పీటలు మీద కూర్చున్నరండి...జోడీ అదుర్స్స్స్స్ సుపర్బ్ ఉన్నారు. అప్పటికే పెళ్లి కూతురు సైడ్ పంతులు పెళ్లి కొడుకు సైడ్ పంతులు పోటీలు పది మరి మంత్రాలు చదివేస్తున్నారు…అప్పుడు అర్దం అయింది సంభావన బాగాఆఆ ఇస్తాం అన్నారని, సర్లెయ్ ఫోటోస్ తీడ్దాం కదా అని ముందు వరస లో కి వెళ్ళాం, అక్కడ ఫర్స్ట్ లైన్ అంత వైట్ న్ వైట్ క్యాండిడేట్స్, చూసి అవాక్క్కయ్య (వాళ్లింట్లో టైడ్ వాడతారంత) పాలిటిషియన్స్ అని వేరేగా చెప్ప్కరలేదు కదా…కొంచం స్ట్రాంగ్ POLI"TRICK"IAN వచ్చారు లెండి…ముద్రగడ పద్మనాభం.
ఎవరి హడావిడి లో వాళ్ళు ఉంటె ఒక మనిషి మాత్రం పద్మనాభం తో మంతనాలు జరుపుతున్నాడు ఎవరాఆఆ అనుకుంటున్నార ఇంకెవరు మా దాడి సతీష్ (దాడి ఇంటి పేరు లెండి) ఉరుఫ్ ఛత్రపతి. సత్య కి బావ నాకు రూమ్ మేట్…ఆక్చ్యువలీ నా రూమ్ మేటె నే కానీ……నేను కూడా ఎప్పుడు మాటలడాలీ అన్న ఫోన్ లోనే అవుతుంది “AVAILABLE ON MOBILE" ONLY…అయిన వాడేది IDEA మొబైల్ – AN IDEA CAN CHANGE YOUR LIFE అంటే ఎంతో అనుకున్న…..AN IDEA CAN GET YOUR GIFE అని తరువాత తెలిసింది ఈ టాపిక్ గురించి కొంచెం విపులం గా తరువాత బ్లోగ్ లో వివరిస్తా లెండి.. ఆ ఒక్కరోజు ఫేస్ టూ ఫేస్ మాట్లాడగలిగా
టైమ్ 10:42 – ఆఫీస్ లో అయితే మీటింగ్ లేకపోతే చాటింగ్ చేసుకునే టైమ్...
సత్య కి దీప కి మధ్యలో ఒక తెర వేశారు……పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాఇఈ అనడానికి సిగ్నల్ ఆది…పూజారులు అదే ఉత్సాహం తో మంత్రాలు చదువుతూ మా వాడి అమృత తుల్యమైన పాదాలని పళ్లెం లో పెట్టించారు, పెళ్లి కూతురు తండ్రి గారు అహా ఏమీ నా భాగ్యము అన్న టైప్ లో తెగ కదిగేసి ఆ నీళ్ళు చాల్లెసుకున్నారు. మా వాడి ఫేస్ లో ఆనందం అయిన ఫేస్ లో అమితానందం (లోపల ఫీలింగ్స్ నాకు తెలియవు ). తరువాత చెప్తున్నాడు
“అరెయ్ ఈ సీన్ కి TAKE ల మీద TAKE లు తీసుకుంటే బాగుంటుంది"
ఆంటీ చాలా హడావిడిగా పెళ్లి మండపం లో అవసరమైనవి అందిస్తూ….ఆ గోల్డెన్ మొమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు ..అప్పుడు అసలు సీన్ స్టార్ట్..జీలకర్ర బెల్లం.. వేడ్ మంత్రాల సాక్షిగా ముక్కోటి దేవతలు చూస్తుండగా…చూస్తుండగా… 10:51 అయ్యింది…..దానితో పెళ్లి అయింది (ఇక్కడ కొంచం కవిత్వం రాద్డాం అనుకున్నBUT ఐడియా రాలేదు).. అందరి ఫేస్ లో ను ఆనందోత్సాహలు….మా వాడి ఫేస్ లో మాత్రం ఒక PROUD ఫీలింగ్…జీవితం లో ఏదో సాదించ అన్న టైప్ లో లుక్ ఇచ్చాడు మా వంక.
ఇంటర్వల్ అయ్యిందండి.
డ్రెస్ చేంజ్ – రెడ్ కలర్ శేర్వాణి లో మా వాడు ఇరగడీశాడు…సీరీయస్ గా కొంత సేపు మళ్ళీ మంత్రాలు అక్షింతలు హంగామా...తరువాత ఫోటో సెషన్…లంచ్.. మేమందరం హ్యాపీ గా తింటూ లార్జ్ స్క్రీన్ లో వీడి పెళ్లి ఎంజాయ్ చేస్తుంటే పాపం మా వాడు మాత్రం సీరీయస్ గా మొహం పెట్టి కూర్చున్నాడు పెళ్లి పీటల మీద….నేను వెళ్ళి నవ్వరా అక్కడ వీడియో లో సరిగ్గా రావతలేదు అని చెప్తే...వాడు”నవ్వుతా రా నవ్వుతా పొద్దున నుంచి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చోపెట్తారు మీరు మాత్రం ఒక్కొక్కడు కంచాలు కంచాలు లాగిస్తున్నారు” అని గోళ.
అలా కస్టపడి ఇష్టపడి...సప్తపది....తరువత…మిట్ట మధ్యాహ్నం అరుంధతి నక్షత్రం చూడడం తో... SUCCESSFUL గా కంప్లీట్ చేశాడు….
ఇంత అయ్యాక నేను వెనక్కి వెళ్తూ ఆలోచించా….మా వాడు సాధించింది సంపాదించింది ఏంటి అని…..చాలా చాలా ఉంధండి…..ఒక పెద్ద టైటల్…దానితో పాటు రూల్స్ న్ రెస్పాన్సిబిలిటీస్ ను..
చివరగా ….టైటల్
“SATYA BANGAYA UNCLE”…..
ఇదే మా సినిమా శుభం కార్డ్ అంది. బాగుంది కదా
Jokes apart,
Message to Satya: అరెయ్ ఈ పెళ్లి పుస్తకం లో నేను రాసింది ఒక పేజ్ మాత్రమే రా…నువ్వు రాయవలిసింది చాలా చాలా ఉంది…ఎన్నో ఆనందాలు, కష్ట నష్టా లు, సుఖాలు, గొడవలు, కేరింతలు, ఎన్నో ఎన్నో ఈ మ్యారేజ్ లైఫ్ లో (విదౌట్ ఎక్స్పీరియెన్స్ అనుకో)……ఎంజాయ్ చేయ రా. నా ఫేస్ కి ఫిలాసొఫీ సెట్ అవ్వక పోయిన…..ఉద్వేగం తో రాస్తున్న మామ…...
i am extremely happy for you ra. I know you are going to have a wonderful life ahead.
BEST OF LUCK…TAKE CARE…ENJOY WELL
To my Sweet Friend….who will always be my best buddy & who is very much special in my life…
Let’s hope sorry I am Sure our friend ship remain forever and ever and ever.
From Sri :)
సెలవు మరి. వచ్చెపోస్ట్ లో కలుస్తా.. నా మొదటి బ్లోగ్.తప్పులు ఉంటే మన్నించండి అసలు అర్దమే తప్పానుకుంటే క్షమించండి....కొంచెం తెలుగు కి తెగులు పట్టింది కదా :)