Friday, March 7, 2008

PELLI PUSTAKAM

ఆరెయ్ బ్లోగ్ రాయ రా……….బ్లోగ్ రాయ రా……బ్లోగ్ రాయ రా…

ఎన్ని సార్లు చెప్పాను రా…రాయి……బ్లోగ్ రాయి…… వేస్ట్ రా నువ్వు…

ఒక బ్లోగ్ రాయడం చేత కాదు ఎందుకు పనికి రాని పనికిమలిన వెదవ్వి…..

బ్లోగ్ రాయని వాడు దున్న పోతైపుటును… అర్దం కాలేదు కదా…….హ హ హ…
గత సంవత్సరం నుంచి ఒక మహానుభావుడు నన్ను అన్న మాటలు ఇవన్ని…..ఎప్పుడు అడిగిన ఒకటే చెప్పేవాడిని హరిహారాదులు వచ్చి చెప్పిన, ప్రళయం వచ్చి ఈ విశ్వమే సున్యమయిపొయిన, ప్రపంచం లో ఎనిమిదో వింత జరిగిన క్షణం లో ఆలోచిస్తా అనేవాదినిసరిగ్గా అప్పుడే జరిగిండండి కొంచం ఇంచు మించు గా పైన చెప్పిన వింతాలకి దగ్గరగా
FEB 16 2008, 10:51 నిముషాలకి…… అదే
సత్య పెళ్లి

కట్ చేస్తే 3 స్టార్ హోటెల్ (పెళ్లివేదిక) దాని ముందు ఎంతో అందం గా రెండు పేర్లు “సత్య వెడ్స్ దీప”….అప్పటికీ నమ్మకం కుదిరింది. సత్య పెళ్లి కొడుకాయనే మా సత్టీగాడూ పెళ్లి కొడుకాయనే.
టైమ్ 9:13 – పిల్లలు స్కూల్ కి వెళ్లే టైమ్ .. న లాంటి వాడు పడుకుని లేచే టైమ్ ఆది....
ఆటో వాడు వెనక్కి తిరిగి.3 నక్షత్రాలు తరువాత చూద్దుగాని ముందు న 3 చక్రాల ఆటో దిగి డబ్బులు ఇస్తే బాగుంటుంది అన్నాడు. ఏమీ చేస్తాం కామ్ గా డబ్బులు ఇస్తూ కోపం గా 3స్టార్ కాదు రా ఇది 5 స్టార్ ఇవాళ అన్న....అయోమయంగా చూస్తాడు అనుకున్న కానీ వాడు నన్ను అప్పుడే ఎర్ర బస్ ఎక్కి వచ్చి మొదటి సారి స్టార్ హోటెల్ చూస్తున్న ఆనట్టు చూసాడు..అదేంటి అని అడిగాడు.. నేను 3 నక్షత్రాల మద్య దగ దగ లాడుతున్న రెండు కొత్త నక్షత్రాలు నీకు కనపడటలేదా అని అడిగా “సత్య వెడ్స్ దీప” బోర్డ్ చుపిస్తు...ఒకిన్థ గర్వం గా అబ్బో కొంచెం కాదు కాదు చాలా ఎక్కువ చేసా కదా..BUT కాన్సెప్ట్ వెరైటీ గా ఉన్న హడావిడి ఎక్కువ చేసిన అందులో డెప్త్ ఉండండి....

లోపలకి వెళ్ళ అంత ఒకసారి చూశా... పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూజారి ఎవరు లెరు......ఎమన్తెయ్ MAKEUP UNDER PROGRESS అన్నారు.... అసలే ఒక క్షణం వేస్ట్ అయితే గంట బాధపడే టైప్స్ మనం ఏమీ చేయాలా అని ఆలోచిస్తుండగా...గుర్తోచింది సత్తి ఇచ్చిన BUMPER OFFER “ అరెయ్ నా పెళ్లి లో నీ పెళ్లి కి పిల్ల ని సెలెక్ట్ చేసుకో రా అని.....” వాట్ ఆన్ ఐడియా సర్ జి!!! అనుకుంటూ ఫర్స్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు మొత్తం వెతికేస… ఎక్కడ చూసిన పిల్ల తల్లి తప్ప పిల్ల కనపడలేదు…సర్లెయ్ పెళ్లి మొదలైతే వస్తారు లే అనుకుని అడ్జస్ట్ అయిపోయ….5 నిముషాలకి ఎవడో వెనక నుంచి “హై రా మామ అన్నాడు” ఎవరండి మీరు అన్న….నేను మామ గుర్తుపట్టలేదా అన్నాడు….అప్పటికీ కానీ వెలగలేదు
RAYMOND – THE COMPLETE MAN లో ఉన్నధి.. RANJIT - THE FAMILY MAN అని
….బ్రౌన్ శేర్వాణి లో విత్ ఫుల్ మేక్ ఉప్ దర్శనం ఇచ్చారు అయ్యగారు….ఇద్దరం కలిసి మా హీరొ మేకప్ రూమ్ కి వెళ్ళాం…అక్కడ అందరు తెగ హడావిడి గా మేకప్ చేసేస్తున్నారు పక్కన మా వాడు…కామ్ గా కూర్చుని ఉన్నాడు హీరొ ఇక్కడ ఉంటెయ్ మేకప్ ఎవరికి చేస్తున్నరబ్బా అని కొంచం క్లోసప్ లో చూస్తేయ్ ప్రసాద్ అదేనండి సత్య తమ్ముడు గారు……ఏంట్రా అని అడిగితే చెప్పాడు…..పాపం పొద్దున 4 కె వీడికి మేకప్ చేసి కూర్చో పెట్టారని…ఇంత లోనే సెట్ లోంచి హీరొ గారికి షాట్ రెడీ అని కాల్ వచింది…
నేను రంజిత్ లౌంజ్ లో కూర్చుని బతకాని మొదలుపెట్టాం…ఇంతలో ఎవడో వచ్చి రంజిత్ ని చూస్తూ “ARE U A BRIDE GROOM” అన్నాడు తెల్లవాళ్లు వదిలి వెళ్ళిన ఆంగ్ల బాష పై యుద్దం చేసి విజయం సాదించిన వీరుదిలగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ. మా వాడు కాదు అని చెప్పేసి నా వంక చూసాడు…”మామ నిన్ను ఇంకాఆఆఆ YOUTH అని ఎలా అనుకున్నాడు రా” అన్న తరువాత కొంత సేపు వాదించాడు లెండి…పెళ్లి అయిన స్టిల్ అదే జోరు అదే హోరు అని…
అక్కడ అంకల్ (సత్య నాన్న గారు) కనపడితే పలకారిద్దాం కదా అని వెళ్ళాం మాటల్లో అంకల్ “అరె యూ ఆ బ్రైడ్ గ్రూమ్ అంటున్నారు రంజిత్ ని" అయిన కంగారు గా ఒక లుక్ ఇచ్చి “అవునా ఇంకా నన్ను అన్నారేమో అనుకున్న” అన్నారు…ఒకటే నవ్వు ఇక్కడ ఒక విషయం చెప్పాలి… నేను ఇంజినియరింగ్ ఫర్స్ట్ సంవత్సరం లో అదే సత్య ని కలిసిన ఇనిషియల్ డేస్ లో ఒకసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినప్పుడు అంకల్ తో మాట్లాడక…ఈయన చాలా చాలా సీరీయస్ ఏమో, పాపం “సత్తి గాడు” అనుకున్న కానీ కలిసాక అర్దం అయింది….ఎక్స్‌ట్రీమ్లీ స్పాంటేనీయస్…సుపర్బ్ సెన్సె ఒఫ్ హ్యూమర్ అని…చాలా జోవీయల్.. ఎన్నో కామిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి లో ఆయనతో (రాయాలని ఉంది కానీ పూల చొక్కా సీన్స్ లాంటివి చాలా సెన్సర్ చేసా ఒక సెపరేట్ బ్లోగ్ రాయాలి అయిన కామెడీ గురించి)…

If you ask me to rate the Best of the Best....He will be in My Top 10 list.
Uncle....U Rock (ఈ ప్యారగ్ర్యాఫ్ మీకు అంకితం…..మర్చిపోకుండా ఆంటీ కి చూపించండి)

టైమ్ 10:00 – బ్రేక్‌ఫాస్ట్ లు తినేసి అందరు ఆరామ్ గా కూర్చున్న టైమ్….

పెళ్లి సూట్ లో రాజకుమారుడు సత్య పట్టు చీర లో రాజకుమారి దీప పెళ్లి పీటలు మీద కూర్చున్నరండి...జోడీ అదుర్స్స్స్స్ సుపర్బ్ ఉన్నారు. అప్పటికే పెళ్లి కూతురు సైడ్ పంతులు పెళ్లి కొడుకు సైడ్ పంతులు పోటీలు పది మరి మంత్రాలు చదివేస్తున్నారు…అప్పుడు అర్దం అయింది సంభావన బాగాఆఆ ఇస్తాం అన్నారని, సర్లెయ్ ఫోటోస్ తీడ్దాం కదా అని ముందు వరస లో కి వెళ్ళాం, అక్కడ ఫర్స్ట్ లైన్ అంత వైట్ న్ వైట్ క్యాండిడేట్స్, చూసి అవాక్క్కయ్య (వాళ్లింట్లో టైడ్ వాడతారంత) పాలిటిషియన్స్ అని వేరేగా చెప్ప్కరలేదు కదా…కొంచం స్ట్రాంగ్ POLI"TRICK"IAN వచ్చారు లెండి…ముద్రగడ పద్మనాభం.

ఎవరి హడావిడి లో వాళ్ళు ఉంటె ఒక మనిషి మాత్రం పద్మనాభం తో మంతనాలు జరుపుతున్నాడు ఎవరాఆఆ అనుకుంటున్నార ఇంకెవరు మా దాడి సతీష్ (దాడి ఇంటి పేరు లెండి) ఉరుఫ్ ఛత్రపతి. సత్య కి బావ నాకు రూమ్ మేట్…ఆక్చ్యువలీ నా రూమ్ మేటె నే కానీ……నేను కూడా ఎప్పుడు మాటలడాలీ అన్న ఫోన్ లోనే అవుతుంది “AVAILABLE ON MOBILE" ONLY…అయిన వాడేది IDEA మొబైల్ – AN IDEA CAN CHANGE YOUR LIFE అంటే ఎంతో అనుకున్న…..AN IDEA CAN GET YOUR GIFE అని తరువాత తెలిసింది ఈ టాపిక్ గురించి కొంచెం విపులం గా తరువాత బ్లోగ్ లో వివరిస్తా లెండి.. ఆ ఒక్కరోజు ఫేస్ టూ ఫేస్ మాట్లాడగలిగా

టైమ్ 10:42 – ఆఫీస్ లో అయితే మీటింగ్ లేకపోతే చాటింగ్ చేసుకునే టైమ్...

సత్య కి దీప కి మధ్యలో ఒక తెర వేశారు……పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాఇఈ అనడానికి సిగ్నల్ ఆది…పూజారులు అదే ఉత్సాహం తో మంత్రాలు చదువుతూ మా వాడి అమృత తుల్యమైన పాదాలని పళ్లెం లో పెట్టించారు, పెళ్లి కూతురు తండ్రి గారు అహా ఏమీ నా భాగ్యము అన్న టైప్ లో తెగ కదిగేసి ఆ నీళ్ళు చాల్లెసుకున్నారు. మా వాడి ఫేస్ లో ఆనందం అయిన ఫేస్ లో అమితానందం (లోపల ఫీలింగ్స్ నాకు తెలియవు ). తరువాత చెప్తున్నాడు

“అరెయ్ ఈ సీన్ కి TAKE ల మీద TAKE లు తీసుకుంటే బాగుంటుంది"

ఆంటీ చాలా హడావిడిగా పెళ్లి మండపం లో అవసరమైనవి అందిస్తూ….ఆ గోల్డెన్ మొమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు ..అప్పుడు అసలు సీన్ స్టార్ట్..జీలకర్ర బెల్లం.. వేడ్ మంత్రాల సాక్షిగా ముక్కోటి దేవతలు చూస్తుండగా…చూస్తుండగా… 10:51 అయ్యింది…..దానితో పెళ్లి అయింది (ఇక్కడ కొంచం కవిత్వం రాద్డాం అనుకున్నBUT ఐడియా రాలేదు).. అందరి ఫేస్ లో ను ఆనందోత్సాహలు….మా వాడి ఫేస్ లో మాత్రం ఒక PROUD ఫీలింగ్…జీవితం లో ఏదో సాదించ అన్న టైప్ లో లుక్ ఇచ్చాడు మా వంక.

ఇంటర్వల్ అయ్యిందండి.

డ్రెస్ చేంజ్ – రెడ్ కలర్ శేర్వాణి లో మా వాడు ఇరగడీశాడు…సీరీయస్ గా కొంత సేపు మళ్ళీ మంత్రాలు అక్షింతలు హంగామా...తరువాత ఫోటో సెషన్…లంచ్.. మేమందరం హ్యాపీ గా తింటూ లార్జ్ స్క్రీన్ లో వీడి పెళ్లి ఎంజాయ్ చేస్తుంటే పాపం మా వాడు మాత్రం సీరీయస్ గా మొహం పెట్టి కూర్చున్నాడు పెళ్లి పీటల మీద….నేను వెళ్ళి నవ్వరా అక్కడ వీడియో లో సరిగ్గా రావతలేదు అని చెప్తే...వాడు”నవ్వుతా రా నవ్వుతా పొద్దున నుంచి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చోపెట్తారు మీరు మాత్రం ఒక్కొక్కడు కంచాలు కంచాలు లాగిస్తున్నారు” అని గోళ.

అలా కస్టపడి ఇష్టపడి...సప్తపది....తరువత…మిట్ట మధ్యాహ్నం అరుంధతి నక్షత్రం చూడడం తో... SUCCESSFUL గా కంప్లీట్ చేశాడు….

ఇంత అయ్యాక నేను వెనక్కి వెళ్తూ ఆలోచించా….మా వాడు సాధించింది సంపాదించింది ఏంటి అని…..చాలా చాలా ఉంధండి…..ఒక పెద్ద టైటల్…దానితో పాటు రూల్స్ న్ రెస్పాన్సిబిలిటీస్ ను..

చివరగా ….టైటల్
“SATYA BANGAYA UNCLE”…..

ఇదే మా సినిమా శుభం కార్డ్ అంది. బాగుంది కదా

Jokes apart,

Message to Satya: అరెయ్ ఈ పెళ్లి పుస్తకం లో నేను రాసింది ఒక పేజ్ మాత్రమే రా…నువ్వు రాయవలిసింది చాలా చాలా ఉంది…ఎన్నో ఆనందాలు, కష్ట నష్టా లు, సుఖాలు, గొడవలు, కేరింతలు, ఎన్నో ఎన్నో ఈ మ్యారేజ్ లైఫ్ లో (విదౌట్ ఎక్స్‌పీరియెన్స్ అనుకో)……ఎంజాయ్ చేయ రా. నా ఫేస్ కి ఫిలాసొఫీ సెట్ అవ్వక పోయిన…..ఉద్వేగం తో రాస్తున్న మామ…...

i am extremely happy for you ra. I know you are going to have a wonderful life ahead.

BEST OF LUCK…TAKE CARE…ENJOY WELL

To my Sweet Friend….who will always be my best buddy & who is very much special in my life…

Let’s hope sorry I am Sure our friend ship remain forever and ever and ever.

From Sri :)

సెలవు మరి. వచ్చెపోస్ట్ లో కలుస్తా.. నా మొదటి బ్లోగ్.తప్పులు ఉంటే మన్నించండి అసలు అర్దమే తప్పానుకుంటే క్షమించండి....కొంచెం తెలుగు కి తెగులు పట్టింది కదా :)

1 comment:

Anonymous said...

Late ga rasina Latest ga kummesav ra.
Blog rayara ani annisarlu annanduku ekamga book ney rasesav.

mottaniki neetho blog rayinchadaniki nenu pelli chesukovalasi vachindi annamata.

kani chaala bagundi blog. naa pelli nenu malli choosukunnattu undi. Nice sense of humour.

You are on of the best things that happened to me in my life ra. I still cant forget the golden days we spent together.

You were always there for me....and i promise and hope that our friendship will continue like this forever.

Thanks a lot for everything ra.

Inka blogs raayu....continue with the wonderful start you have given.....keep rocking dude as you always do.

-your Satya