Friday, September 30, 2011

గుర్తుకొస్తున్నాయి...మర్చిపోతే కదా - అయిదవ భాగం!

నాలుగో బాగం ఎక్కడో చాల దూరం లో వుంది, అందరు మర్చిపోయివుంటారు కూడా....ఈ అయిదోవ బాగం రాసి కరెక్ట్ గ 3 YEARS అయింది కానీ పోస్ట్ చేయాలనిపించలేదు.....ఎందుకో ఇవాళ మళ్ళి తీసా దీనిని....నాకు అన్నిటికన్నా నచ్చిన పార్ట్...ఎందుకంటే ఇది మా నాన్నగారి గురించి...

Fourth Part Summary:


http://sri-livenletlive.blogspot.com/2008/12/blog-post_8714.html

Fifth Parth Begins:

ఇంత
పెద్ద స్టొరీ రాసాక కూడా నేను అనుకుని అని ఎవడు anukuni undaru, 7 Class అయ్యాక నన్ను స్కూల్ మార్చారు, కొత్త వాతావరణం కొత్త మనుషులు (co-ed vundi :)). అప్పటివరకు సెక్షన్ కి ౩౦ మంది ని చుసిన నన్ను ఒక్కసారి 80 మెంబెర్ సెక్షన్ లో తోసేసారు. క్లాసు అంత మంద లాగా వుంది ఎవడిని చుసిన ఎక్కడ చుసిన Chemistry, Physics అనేవాడే తప్ప చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఊసే లేదు..నాకు అర్ధం అయిపొయింది నన్ను అడివిలోంచి తీస్కోచి జూ లో పడేసారని. దాని పేరే IIT aspirants. First unit మార్క్ లు...నేనే ఫస్ట్ (లాస్ట్ నుంచి), నా తప్పేం లేదండి ముందు 80 వస్తెయ్ టాప్ షో అది -- ఇక్కడా అంతే వచాయి కానీ ఫ్లోప్ షో ఇది...ఏమి చేసానో తెలీదు కానీ halfyearly కి నేనే నమ్మలేకపోయా First ( సారి First నుంచీ)...కానీ ఇదంతా ఓన్లీ నాన్నగారి వల్లే, ఆయిన నా Dedication గురించి అంత confident గా ఎలా వుండేవారో తెలీదు కానీ నేను మాత్రం అయిన నమ్మకాన్ని వమ్ముచేయలనిపించలేదు. నిజం చెప్పాలి అంటెయ్ అప్పటికి Purpose of Life ఏంటో తెలిసి వచ్చింది. తరువాత ఇంకా తిరిగి చూసుకోలేదు....అన్న లేదు దున్న లేదు ఎవడన్న ఈకే (ఇది ముందు పోస్ట్ లోని ఈక కాదు :)). నాన్నగారే నా బలం, ఎవరన్న ఇంట్లో ఇంకా చదవాలి ఇంకా చదవాలి అంటారు కానీ ఆయిన మాత్రం పడుకో వాసుకొండ, ఎలాగో నువ్వేయ్ First ఎందుకు కష్టపడతావు అనేవారు.

నాకు
రాంక్ వచ్చిన ప్రతి సారి చుట్టాళ్ళకి, ఫ్రెండ్స్ కి "మా వాడు First రా" అని గర్వం గా చెప్పుకొనేవారు అమాయకపు కళ్ళలోని ఆనందం కోసం ఏదైనా చేయాలనిపించేది. ప్రతి విషయం చెప్పేవాడిని ఎవరితో అన్న అబద్ధం చేపోచు కానీ ఆయిన దగ్గర మాత్రం దాచలేను. రోజు ఆయిన గుండెల్లకి హత్తుకుని పడుకున్టేయ్ కానీ నిద్రపోయేవాడిని కాదు. నాకు అన్ని చెప్పేవారు ఎలా వుండాలి అందరితో, ఎదుటి వాడికి సాయం చేయడం, friendship లో వున్నా విలువ అన్ని ఆయిన చెప్పినవే. నేను ఏదో సాదిస్తా అని నమ్మకం ఎప్పుడు
ఆయనకీ, అది ఇప్పటికి 1% కూడా పూర్తి చేయలేదు....కానీ చేస్తా...life has just started
My Dad's Definition of life is very simple...LIVE FOR THIS MOMENT..forget past, don't think about future. I can just count on fingertips, the moments he felt angry or tensed.

ఆయిన జీవితం లో రోజు స్వార్ధం తో, కుళ్ళు తో వున్నా సంగటన ఒక్కటి కూడా లేదు ఒకరి గురించి ఎప్పుడు చెడు గా చెప్పడం విని ఎరుగను. ఎప్పుడు అనేవారు "చేతనయితే మంచి చూడు, చెప్పు లేదంటే వదిలేయ్, vaadu పాపాన వాడెయ్ పోతాడు". వచ్చిన డబ్బుల్లో ఎప్పుడు కొంత పక్కవాళ్ళకి సాయపడదనికే ఇచ్చేవారు, విషయం నాకు చాల సంవత్సరాలు వరకు తెలియలేదు నాకేంటి ఎవరికీ తెలియనిచేవారు కాదు. ఇన్ని చేసి ఇంత చెప్పి నన్ను ఇక్కడ నిలబెట్టిన ఆయిన రోజు ఇది జ్ఞాపకాలని పంచుకొందామంటే నాతో లేరు. This is the worst unforgettable memory of my life.

మంచి వాళ్ళు అంటే దేవుడుకి ఎందుకో అంత కక్ష తనదగరికి అంతత్వరగా తీసుకెల్లిపోతాడు. ఆయిన గురించి ఇప్పటికి ఎంతో మందిచేప్పుకుంటారు "చౌదరి గారు వల్ల మేము బతుకుతున్నాం, ఆయిన వల్లే ఇలా వున్నాం" అని. ఆయిన మరణించిన రోజున అర్ధం అయింది అందరి గుండెల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించారో అని. నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం ఆయినకి కొడుకుగా పుట్టడం. నాకు జీవితం అంటే ఏంటో నేర్పిన ఆయిన నా నుంచి కనీసం వీసమేత్తు సాయం కూడా తీస్కోలేదు. అదేనేమో ప్రేమ అంటెయ్. ఎందుకు నాన్నగారు మమ్మల్ని అంత త్వరగా వదిలి వెళ్ళిపోయారు మేము ఎం తప్పు చేసాం? కానీ ఇంకో జన్మ అంటూ వుంటే మీరు నాకు కొడుకుగా పుట్టాలి నేను మీకు అన్ని చేయాలి అదే నా కోరిక.

పార్ట్ మొదలు పెట్టె టైం కి complete చేసిన టైం కి మధ్యలో ఎన్నో ఎన్నెన్నో జరిగాయి...అన్న పెళ్లి, నా పెళ్లి అన్ని..కానీ చూడడానికి ఆయిన లేరు....కానీ పైనుంచి ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే వుంటారు. ఆయిన ఆశీర్వాదం మాకు కొండంత బలం. అది చాలు డబ్బు తో పనేమీ లేదు... ఇవాలే ఎందుకు రాస్తున్నాడు ఇది అనిపించోచు ఎందుకంటీ

మా నాన్నగారు లోకం లోంచి వెళ్ళి రోజుకి 4 సంవత్సరాలు అయింది...

ఒకటి మాత్రం చెప్పగలను నాన్నగారు - ఏదోక రోజు మీ లాగా.....నేను బతికి పది మందికి జీవితాన్ని ఇచే స్థాయి కి మాత్రం వస్తాను.
my last request to you dad - Please take out all the crap from me and give a great heart n mind as yours

Signing off...Ur Fav...Vasu

1 comment:

Satya said...

Mama..i can understand the meaning behind every letter and every word you have penned. Uncle's blessings will always be with you.